పోలీస్ స్టేషన్ ముందు విషాద ఘటనడ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మనస్తాపం – పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా నవంబర్ 5 మన వార్త: కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి పోలీసుల వ్యవహారంతో మనస్తాపానికి గురై, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తిని కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతని బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ 120 నమోదైనట్లు పోలీసులు తెలిపారు.మీన్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అనంతరం అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.స్థానికులు అతడిని ఆపడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే మంటలు వ్యాపించడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

Leave a Comment