*
ఇల్లంతకుంట,అక్టోబర్ 30 (మన వార్త ప్రతినిధి):భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా,జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ ఆదేశాల మేరకు ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో రేపు శుక్రవారం (అక్టోబర్ 31-2025) “ఉదయం 7 గంటలకు”..బస్టాండ్ నుండి 2K రన్ నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో మండలంలోని యువతీ యువకులు,విద్యార్థులు,క్రీడాకారులు,వాకర్స్,అలాగే ఉత్సాహవంతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్సై సిరిసిల్ల అశోక్ పిలుపునిచ్చారు.