గజ్వేల్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కె రన్…

అక్టోబర్ 31( మన వార్త ప్రతినిధి)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐ ఓ సి గ్రౌండ్ వద్ద గజ్వేల్ పోలీస్ ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించారు ఈ సందర్భంగా గజ్వేల్ సి ఐ రవికుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని 2 కె రన్ నిర్వహించడం జరిగిందని అన్నారు, అనంతరం గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ, ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని, 150వ సర్దార్ వల్లభాయ్ జయంతి వేడుకల్లో భాగంగా గజ్వేల్ లో నిర్వహించిన 2కే రన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు

Leave a Comment