ములుగు ఆగస్టు 19 మనవార్త ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కలువుపల్లి గ్రామంలో 18 ఆగస్టు 2025 సోమవారం పశువులను మేపుటకు వెళ్ళినటువంటి దుబారి రామయ్య,అలానే చేపలు పట్టుటకు వెళ్ళినటువంటి సాయికిరణ్ ,రాజబాబు, రాములు సాయంత్రం అయినా ఇంటికి రాలేదు.వాగు ప్రవాహం పెరుగుతూ పోతుండగా గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం జరిగింది.సమాచారం తెలుసుకున్న ఎమ్మార్వో సురేష్ కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి 11 గంటలకు ఎన్డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇవ్వడం జరిగింది.ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ నేతృత్వం లో ఎన్టీఆర్ బృందం ఘటన స్థలానికి చేరుకున్నాయి.వాగు ప్రవాహం ఎక్కువ ఉండటం వల్ల తాడు సాయంతో వాగు దాటి మొదట పశువుల కాపరైనటువంటి రామయ్యను సురక్షితంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది.అంతటితో ఆగకుండా వాగు నుండి కిలో మీటర్ ముందుకు పోయి వెతుకుతూ ఉండగా చాపలు పట్టుటకు వెళ్లినటువంటి సాయికిరణ్,రాజాబాబు, రాములను గుర్తించి వారిని సురక్షితంగా వాగు దాటించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ డి ఆర్ ఎఫ్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ ,ఏఎస్ఐ సుధీర్, సురేందర్, హెడ్ కానిస్టేబుల్ జగదీష్, చంద్ర, రమేష్, కానిస్టేబుల్ ఆనంద్ ,రమణమూర్తి, విశాల్ మరియు వారి బృందం పాల్గొనడం జరిగింది. అలానే తాడ్వాయి మండలం నుండి ఎమ్మార్వో సురేష్,ఎంపీడీవో,ఎస్సై ,రెవెన్యూ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.