బైకును ఢీ కొట్టిన కారు ముగ్గురికి తీవ్ర గాయాలు…

చిన్న శంకరంపేట ఆగష్టు 18 (మన వార్త ప్రతినిధి) చిన్న శంకరంపేట మండలం ఎస్ కొండాపూర్ గ్రామ శివారులో బైకును కారు ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది, బైకుపై వెళ్తున్న రాజు, లక్ష్మణ్, శ్రీశైలం, ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు, గవలపల్లి నుండి మెదక్ వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు గాయాల పాలైన వారిని మెదక్ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకొని చేస్తున్నారు,

Leave a Comment