జగిత్యాల,జూలై 17 (మన వార్త ప్రతినిధి సాకేత)
జగిత్యాల జిల్లా లక్ష్మీపురం గ్రామంలో గల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల లో నిన్న జరిగిన బోనాల సెలబ్రేషన్ కార్యక్రమంలో వండినటు వంటి నాన్-వెజ్ ఆహారంతో ఫుడ్ పాయిజన్ జరిగి అమ్మాయిలు అస్వస్థతకు గురి అవ్వడం జరిగింది. ఐదుగురు పరిస్థితి వాంతులు విరేచనాలతో జగిత్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. గురువారం రోజు ఉదయం 3 గంటలకు ఇద్దరూ విద్యార్థినిలు, 11 గంటల తర్వాత మిగతా ముగ్గురు విద్యార్థినిలు అడ్మిట్ అవ్వడం జరిగింది. వీరంతా కూడా 12 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రమే.మిగతా 40 మంది పిల్లలందరినీ వయసు 12 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండటం వల్ల పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి వారికి మహాత్మ జ్యోతిబాపూలే వద్దనే వైద్య శిబిరం నిర్వహించి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి మళ్లీ సురక్షితంగా ఉన్నారని తల్లిదండ్రులకు సమాచారం అందించామని ఉపాధ్యాయులు తెలిపారు.ఇప్పుడు ఉన్న ఐదుగురు విద్యార్థిని లతో పాటు ఉపాధ్యాయ బృందం మరియు వారి తల్లిదండ్రులు కూడా హాస్పిటల్లో ఉన్నారు.ప్రస్తుతం వారి ఆరోగ్యం కుదుట గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హుటా హుటిన బయలుదేరి అక్కడ పరిస్థితికి కారణమైన విషయాన్ని హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థినిలను అలాగే ఉపాధ్యాయ బృందాన్ని, వంటకు సంబంధించిన ఇంచార్జ్ ని అడిగి తెలుసుకున్నారు.నిన్న వండినటువంటి చికెన్లో మసాలాలు కారము అధికంగా ఉండటం వల్ల మాత్రమే కావడం వల్ల విద్యార్థులకు వాంతులు విరోచనాలు అయిందని పేర్కొన్నారు.