వేములవాడ జులై 10 ( మన వార్త ప్రతినిధి ) వేములవాడ రూరల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా వనపర్తి పరశురాములు ను నియమించడం జరిగింది. వేములవాడ మండల బిజెపి ప్రధానికార్యదర్శిగా నియమించినందుకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి కి మండల అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ కి, పెద్దలు రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ కి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమనేని వికాస్ కి, మాజి ఎంపీపీ బండ మల్లేశం యాదవ్ కి, కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో పార్టీ ఆదేశాను సారం నడుచుకొని మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో పార్టీ ఎదుగుదలకు పనిచేస్తానని వనపర్తిపరశురాములుతెలియజేశారు.