శంకరపట్నం:మే08(మనవార్త ప్రతినిధి నేరెళ్ల సంతోష్) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలోని ప్రధాన రహదారిని విస్తరించాలని గురువారం ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ కు గ్రామ యువకులు వినతిపత్రాన్ని సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారి బాగా ఇరుకుగా ఉన్నందున రవాణా వాహనాలు,పెద్ద వాహనాల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతున్న దృష్ట్యా రహదారి విస్తరణ చేపట్టాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. స్పందించిన ఎంపీడీవో కలెక్టర్ కి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు చల్లా రాజ్ కుమార్,బిజెపి నాయకులు రాసమల్ల శ్రీనివాస్,యువకులు పరకాల లక్ష్మణ్,గడ్డం శ్రీకాంత్,తోట రాజు,నూనె సంపత్,చిన్నవేణి శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.