ఎల్కతుర్తి సమీపంలో రోడ్డు ప్రమాదం…..

ఎల్కతుర్తి జూన్ 19 ( మన వార్త ప్రతినిధి)

ఎల్కతుర్తి మండల కేంద్రంలోని కార్నల్ స్కూల్ సమీపంలో ఈరోజు తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ–బైక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న సూరారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకుడు భాష బోయిన రవి (వయసు 45) అక్కడికక్కడే మృతి చెందారు.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఈ విషాద ఘటన కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రవిని వ్యక్తిగతంగా అభిమానం కలిగిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Comment