డాక్టర్ ఓపీ చూస్తే..మందులు ఇక్కడే కొనాలి.**ఇదో కొత్త రకం మెడికల్ మోసం..ఆర్ధిక ఇబ్బందుల్లో రోగులు.**కొందరు ఆర్ఎంపీ లతో డాక్టర్ల సత్ సంబంధాలు.. ఒప్పందాలు.**యాదాద్రి భువనగిరి జిల్లా జూన్ / 16 / మన వార్త జిల్లా ప్రత్యేక కథనం.*హైదరాబాద్ కు అతి దగ్గరలో ఎంతో అభివృద్ధి చెందుతున్న భువనగిరి డివిజన్ లో ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులు పెరిగాయి. అయితే వైద్యము వ్యాపారము లా మారిపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు..ముఖ్యంగా భువనగిరిలో వైద్యాన్ని వ్యాపారంగా మారిందని పలువురు తప్పు పడుతున్నారు. డాక్టర్ల వైద్య వ్యాపారం ముందుకు సాగేందుకు కొందరు ఆర్ ఎం పి లు , అలాగే ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీస్ సర్ల సహకారంతో కొన్ని ఆసుపత్రులు కొత్త పద్ధతినీ ఎంచుకుంటున్నాయి.ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ ధర నుంచి ఇతర వైద్య ఖర్చులన్నీ అమాంతం పెంచేశారు. రోగులను నిలువునా దోచుకుంటున్నారు. కార్పొరేట్ తోపాటు ప్రైవేటు ఆస్పత్రులు పెరిగాయి.*ప్రైవేటు ఆస్పత్రుల్లో నిలువు దోపిడీ**ఓపీ నుంచి అన్ని ధరలూ భారీగా పెంపు**ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆసుపత్రి యాజమాన్యాలు**ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రోగులు*ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడ అత్యవసర ఓపీ పేరుతో భారీగా సొమ్ములు తీసుకున్నారు. చికిత్స పేరుతో కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో వచ్చిన రోగులు రోగం తగ్గక పోవడంతో భారీగా ఇళ్లు గుల్లవుతున్నాయి.ప్రవేట్ ఆసుపత్రులు పై జిల్లా వైద్య అధికారులు సమగ్ర దర్యాప్తు చేస్తే అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.