చిరస్మరణీయుడు నందమూరి తారక రామారావు
గజ్వేల్ మే 28 (మన వార్త ప్రతినిధి జీ మురళి )
ఆంధ్రపదేశ్ మాజీ ముఖ్య మంత్రి,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 10 2 వ జయంతి సందర్భంగా బుదవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యం లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ గజ్వేల్ మండల అధ్యక్షుడు నల్ల రాము,ఎస్ టి ఆర్ అభిమాన సంఘం నాయకులు వేముల వెంకటేశ్వర రావు, పరుచూరు రాజు మాట్లాడుతూ సామాజిక విప్లవానికి నాంది వేసిన మహా నేత ఎన్టీఆర్ అని,రెండు రూపాయలకు కిలో బియ్యం,చేనేత వస్త్రాల పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా ఎంతో మంది పేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారుఈ కార్యక్రమంలో నాయకులు ఎంఆర్ఎఫ్ శ్రీనివాస్, పరుచూరి చింత కుమార్، ఆర్కే శ్రీనివాస్, వెంకట్ రావు,ప్రసాద్, నాయిని తిరుపతి, జె విఠల్, సుమో శ్రీనివాస్, రిమ్మనగూడ శ్రీనివాస్, మోచే ప్రభాకర్,శ్రీధర్, భాగయ్య, ఎర్రవాడ వెంకటి, జనార్దన్ రెడ్డి,ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు