వేములవాడ ఫిబ్రవరి 05 (మన వార్త )
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ 10వ వార్డు అభ్యర్థిగా మెుట్టల అనూష మహేష్ ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజల నుంచి విశేష స్పందన పొందుతున్నారు.ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి స్పష్టమైన హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్న ఆయన ప్రచారం వార్డులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.నేను వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తక్షణమే పరిష్కరించాల్సిన రెండు ప్రధాన సమస్యలను గమనించాను. డ్రైనేజీ, పారిశుధ్యం మరియు స్ట్రీట్ లైట్లు. ఈ సమస్యలు నేను గెలిచిన వెంటనే మొదటి పని గా లైట్స్ మరియు డ్రైనేజీ పారిశుధ్య పనులను సత్వరమే చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.రోడ్లు, తాగునీరు, పెన్షన్ కోసం తోడ్పడుతాను మరియు మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పేదలు, మహిళలు, యువత సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని మొట్టాల అనూష మహేష్ పేర్కొన్నారు.BRS పార్టీ అమలు చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలను వివరించిన ఆయన, పార్టీ కార్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక BRS నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.రాష్ట్రం లో మార్పు కోరుతున్న ప్రజల ఆశలతో BRS మరింత బలపడుతున్నట్టు ఈ ప్రచారం స్పష్టంగా చూపిస్తోంది.