14 ట్రాక్టర్ల వడ్లు వరద పాలయ్యాయి * సోమదేవరపల్లిలో వడ్లు వరదలో కొట్టుకుపోయిన ఘటన….

ఎల్కతుర్తి అక్టోబర్ 30 మన వార్త ప్రతినిధి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా వరద ఉద్ధృతంగా ప్రవహించి రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. సోమదేవరపల్లి గ్రామానికి చెందిన బాలేరావు ఆదిత్య పొలంలో పోసిన వడ్లు ఇంటికి కొట్టడానికి సిద్ధంగా ఉంచిన 14 ట్రాక్టర్ల వడ్లు వరదలో కొట్టుకుపోయినట్టు సమాచారం.నిన్న రోజంతా కురిసిన భారీ వర్షంతో చెరువులు, వాగులు పొంగి పొర్లాయి. ఫలితంగా పొలాల్లో నిల్వ చేసిన వడ్లు నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయాయి. ఈ ఘటనతో రైతు ఆదిత్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.స్థానికులు చెబుతున్న ప్రకారం, గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వడ్లు ఎండబెట్టడం, నిల్వ చేయడం కష్టమైపోతోంది. వ్యవసాయాధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టపరిహారం కోసం చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.ఈ ఘటన ధర్మసాగర్ మండలంలో వర్షాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Leave a Comment