వేములవాడ సెప్టెంబర్ 15 (మన వార్త ప్రతినిధి )కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలోనే సాయి మహాలక్ష్మి గార్డెన్లో షూటో రాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ ఛాంపియన్షిప్ 2025 కరాటే పోటీల్లో వేములవాడ ఒకినావ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న వేములవాడ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో మొత్తం 60 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటగా, వారిలో పలువురు బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. మొత్తం 25 బంగారు, 18 వెండి, 12 కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. అలాగే స్పారింగ్ విభాగంలో ఉప్పల పవన్ రాజ్ గ్రాండ్ చాంపియన్షిప్ కప్ ను గెలుచుకున్నారు. సాధించారు ఈ సందర్భంగా జిల్లా ఒకినావ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్, సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నాన్ మాట్లాడుతూ తమ అకాడమీ విద్యార్థులు సౌత్ ఇండియా కరాటే పోటీ లో తమ కృషితో మంచి ప్రతిభను చూపించారని, ఇది ఎంతో గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఒ కి నా వా స్పోర్ట్స్ అకాడమీ ఇన్స్పెక్టర్లు ఎం. తిరుపతి, అర్జున్ సింగ్, సిహెచ్ సూర్య జయచంద్ర ఉన్నారు.