కావేరి సీడ్ ప్లాంట్ ముందు రైతుల ఆందోళన…

.శంకరపట్నం:ఆగస్టు18(మనవార్త ప్రతినిధి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ కావేరి సీడ్ ప్లాంట్ ముందు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ నాలుగు జిల్లాలకు చెందిన సీడ్ ఆర్గనైజర్లు రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు.సుమారు 4 వేల ఎకరాలలో ఆడ,మగ వరి విత్తనాలు ఇచ్చి దిగుబడి రాకపోతే నష్ట పరిహారం కింద 70 వేలు అందిస్తామని చెప్పి నట్టేట ముంచారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులం తీవ్రంగా నష్టపోయామని బోరున విలపించారు.ప్రొడక్షన్ అస్టెంట్ జనరల్ మేనేజర్ సుమన్ రావు ఆర్గనైజర్లతో ఫోన్లో మాట్లాడి రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింప చేశారు.

Leave a Comment