కాంగ్రెస్ పార్టీపై,నర్సారెడ్డి పై దుష్ప్రచారం చేస్తే కేసులు తప్పవు…

-కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్షాలు…
గజ్వేల్ జూలై 25 (మన వార్త ప్రతినిధి జీ మురళి)
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి వైరల్ చేయడం సిగ్గుచేటని, దమ్ముంటే ఆయన మాట్లాడిన పూర్తి వీడియోను ప్రజల ముందు ఉంచాలని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ డిమాండ్ చేశారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, నర్సింహ రెడ్డి, యాదగిరి, డాక్టర్ వహీద్, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి రాములు గౌడ్, మజీద్ కమిటీ చైర్మన్ సయ్యద్ మతీన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు అజార్ సీనియర్ కాంగ్రెస్ నేతలు నక్క రేగొండ గౌడ్, సమీర్, జహీర్, లక్ష్మారెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, అజ్గర్, జగ్గయ్యగారి శేఖర్ లతో కలిసి గురువారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష బిజెపి, బిఆర్ఎస్ పార్టీ నేతలు సోషల్ మీడియాను నమ్ముకొని ప్రజలను మోసగిస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ సిగ్గు రాలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నర్సారెడ్డి వివరిస్తూ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో మూడేళ్లు ఉంటుందని ప్రజలకు నచ్చజెప్పి పార్టీకి అండగా నిలవాలని దిశా నిర్దేశం చేయగా, కోడిగుడ్డుపై ఈకలు పీకే విధంగా దానిని తప్పుపడుతూ బిజెపి, బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆ వీడియో వైరల్ చేసినట్లు గుర్తు చేశారు. అయితే వారిని తాము ఇప్పటికే గుర్తించగా, గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా కెసిఆర్, నరేంద్ర మోడీ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి ప్రజలను మభ్యపెట్టగా, అదే దారిలో వారి కార్యకర్తలు కూడా నడుస్తున్నట్లు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రతియేటా లక్ష ఉద్యోగాలు, స్విస్ బ్యాంకు నుండి బ్లాక్ మనీ రప్పిస్తానని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ 15 వేలు జమ చేస్తానని తదితర హామీలు ఇచ్చి ప్రజలను మోసగించినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు విక్రయిస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తుండగా, ఆదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు మాఫీ చేసినట్లు చెప్పారు. ప్రజలను మోసగించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ తీసుకున్న 42 శాతం బీసీ రిజర్వేషన్ తో తమ పునాదులు కదులుతాయనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా, చీకటి ఒప్పందంతో బిఆర్ఎస్ మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. చారిత్రాత్మక నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతుండగా, వారు జీర్ణించుకోవడంలేదని, అక్రమాలకు అలవాటు పడిన ప్రతిపక్ష పార్టీల నేతలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు అవినీతి, అక్రమాలతో రాజ్యమేలిన కెసిఆర్ కుటుంబం వేలకోట్ల ప్రజల సొమ్మును పక్కదారి పట్టించగా, ఇంకా రాష్ట్రాన్ని దూచుకునే ప్రయత్నంలోనే అడ్డదారులు తొక్కుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నేతలు కర్ణాకర్ రెడ్డి , శీవులు, జహంగీర్, చెప్పాల శేఖర్, జాకీర్,డప్పు గణేష్, ప్రేం, సంగాపూర్ నరేష్ గౌడ్, రమేష్, హాసన్, అరుణ్, సూక్కం సురేష్, కప్ప భాస్కర్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Comment