మల్యాల,మే 20(మన వార్త ప్రతినిధి)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి వారి ఆలయంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు నేటి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా నేడు భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డప్పు చప్పుల్ల నడుమ స్వామివారికి సమర్పిస్తున్నారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.