రేపటి బందుకు వాణిజ్య వ్యాపారస్తులు ఎవరు కూడా సహకరించవద్దు..


యధావిధిగా షాపులు తెర్చుకోండి: పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్….





వేములవాడ మే 13 ( మన వార్త ప్రతినిధి దెబ్బట్టి ప్రవీణ్)






మంగళవారం రోజున వేములవాడ పట్టణంలో మెయిన్ రోడ్డు ప్రతి షాప్ కు తిరుగుతూ కరపత్రాలు పంచుతూ రేపు బిజెపి బిఆర్ఎస్ ఇచ్చిన బందుకు వాణిజ్య వ్యాపారస్తులు సహకరించద్దని తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ వారన్నారు. యధావిధిగా షాపులు తెచ్చుకొని ఉండాలని వారు వ్యాపారస్తులకు చెప్పడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి చేస్తే ఓర్వకుండా ప్రతిపక్షాలు బిజెపి, టిఆర్ఎస్ నాయకుల ఆడుతున్న నాటకాన్ని ప్రజలు గమనించవలసిందిగా వారు కోరారు. వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయాన్ని విస్తీర్ణం చేస్తామంటే ఎక్కడ బీసీ బిడ్డకు పేరొస్తుందని బిజెపి టిఆర్ఎస్ నాయకులు ఓరవకుండా ఈ యొక్క బంధు చేస్తామని చూస్తున్నారు కాబట్టి ప్రజలు మేధావులు గమనించి తగిన రీతిలో బిజెపి బిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పాలని వారు అన్నారు. రానున్న రోజుల్లో వేములవాడ రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శీనివాస్ నాయకత్వంలో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని వారు అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. రాజన్న ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటుంది బిజెపి బిఆర్ఎస్ పార్టీలే ప్రజలారా మేధావులారా గమనించండి అని కోరారు.

Leave a Comment